Views:
Monday, December 24, 2012
మదోన్మాదుల వికృతం లో అమ్మాయిల డ్రెస్ కోడ్ పాత్ర ఎంత?
Labels:
All,
నేటి భారతం,
భారతీయ సంస్కృతి,
మహిళ,
సమాజం,
సామాజిక సమస్యలు
Subscribe to:
Post Comments (Atom)
Get this widget
Popular Posts
-
ఓ మిత్రుడు ఢిల్లీ సంఘటనపట్ల బాధ్యతారాహిత్యమయిన కామెంట్ ఒకటి గూగుల్ ప్లస్ లో ఉంచాడు. పైగా మార్క్సిష్టులు ఇటువంటి వాటిపట్ల సీరియస్ గా ఉండకూడ...
-
ఇక్కడ పేరు వ్రాయడం లేదు కాని, ప్రధాన నిందితుడు చేసిన మరొక తప్పును ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఇక్కడ చాలా శ్రమపడి బ్లాగుల్లో ఆడవాల్లమీద, ...
-
మంతెన సత్యనారాయణరాజు. ఈ పేరు తెలియని తెలుగువారుండరంటే అతిశయోక్తి కాదు. మా టీ.వీ పుణ్యమా అని పల్లెల్లో సైతం మంతెన అందరికీ సుపరిచితులు...
-
దుర్మార్గం జరగడానికి ఆడా - మగా అనేదానిని బట్టి కారణం ఉంటుందా? బుద్ధి అనేది మనిషికి ఉంటుందా? ఆడకొకతీరు, మగకొక తీరు ఉంటుందా? వ్యవస్థ...
-
నిర్భయ అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు రాంసింగ్ తీహార్ జైలు లో ఆత్మహత్య చేసికొన్నాడు. కాకున్నా అతనికి మరణశిక్ష ఖాయం అయ్యేది. ఇది కేవలం ...
Labels
- All (203)
- అంతర్జాతీయం (1)
- అధ్యయనం (4)
- అనుబంధాలు (3)
- అభివృద్ధి - అసమానతలు - పర్యావరణం (11)
- అలంకరణ (1)
- అలవాట్లు (6)
- అవార్డులు (1)
- అవినీతి (6)
- అవీ-ఇవీ-అన్నీ (4)
- అసమానతలు (15)
- అసమానతలుకులం-మతం (1)
- ఆధ్యాత్మికత (13)
- ఆర్ధికం (7)
- ఆలోచన (8)
- ఓటింగ్ (1)
- కళలు (3)
- కుటుంబం (6)
- కులం-మతం (19)
- గాంధీమార్గం (1)
- చదువు-తెలివి-సంస్కారం (5)
- చరిత్ర (6)
- చర్చ (15)
- చింతన (8)
- తత్త్వం (3)
- తాత్వికత (5)
- నమ్మకాలు-నిజాలు (20)
- నవ్వు (1)
- నవ్వుతూ బ్రతకాలిరా (1)
- నీతి (5)
- నేటి భారతం (59)
- న్యాయం (2)
- పరిపాలన (40)
- పరిశోధన (4)
- పర్యావరణం (6)
- పల్లె ప్రపంచం (4)
- పల్లెప్రపంచం (1)
- పార్టీ పదవులు (1)
- పించన్లు (1)
- పిల్లలపెంపకం (8)
- పురుషాధిక్యత (1)
- పోరాటం (8)
- పోల్స్ (2)
- ప్రక్రుతి జీవన విధానం (3)
- ప్రజ (5)
- ప్రజా సమస్యలు (5)
- ప్రజావేదిక (1)
- ప్రజాస్వామ్యం (2)
- ప్రభుత్వ పథకాలు (8)
- ప్రేరణ (1)
- బ్లాగు ప్రపంచం (4)
- భగవద్గీత (2)
- భారతీయ సంస్కృతి (28)
- భావప్రకటన (1)
- భాష (9)
- భాషాభిమానం (4)
- మన ఆరోగ్యం (7)
- మనసు-మార్గం (4)
- మనిషి-మనసు-ఆలోచన (21)
- మహిళ (17)
- మానవ సంబంధాలు (5)
- మానవహక్కులు (11)
- మార్కెట్ మాయాజాలం (1)
- మార్క్సిజం (7)
- మీడియా (11)
- రాజకీయం (43)
- రాజ్యాంగం (4)
- రాష్ట్ర రాజకీయం (2)
- రాష్ట్రసమస్యలు (1)
- రిజర్వేషన్లు (5)
- రేడియో (1)
- రైతురాజ్యం (1)
- రైల్వే సమస్యలు (1)
- లోక్ సత్తా (1)
- వాదనలు (17)
- విద్య (4)
- విలువలు (3)
- వృత్తి (1)
- వృద్ధాప్యం (2)
- వేర్పాటు ఉద్యమం (6)
- వేర్పాటువాదం (14)
- వ్యక్తిగత సమస్యలు (3)
- వ్యక్తిత్వవికాసం (71)
- వ్యవసాయం (1)
- వ్యసనాలు (1)
- సమాజం (46)
- సరుకుల మాయ (1)
- సామాజిక సమస్యలు (7)
- సామెతలు-సంగతులు (1)
- సామ్రాజ్యవాదం (2)
- సాహిత్యం (7)
- సిద్ధాంతం (14)
- సినిమా (16)
- సేవారంగం (1)
- సైన్స్ (11)
- స్పూర్తి (2)
- స్వచ్చంద సంస్థలు (1)
- హాస్యం (2)

వాళ్ళు ఆ దుస్తులు వేసుకోవడానికి కారణం
ReplyDelete౧. తమ తోటి ఆడవాళ్ళ కన్నా అందంగా కనిపించాలి అనే కోరిక
౨. మగ పురుషులు తమని చూడాలి అనే కోరిక కూడా బలంగా ఉండటం.
తమలోని కామత్వానికి అవి సూచికలు.
ReplyDeleteఒక పక్క చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే
చీరలు బరువు కట్టుకోవడం అనే వాళ్ళు
మాకు పత్తికి మద్దతు ధర దొరకట్లేదు అని పత్తి రైతు అడిగితుంటుంటే Plastic(అదే Artificial నూలు) తో తయారు చేస్తున్న దుస్తులు వేసుకోవడం ఇష్టపడే వాళ్ళ గురించా మీరు అడుగుతున్నది?
ఇది కొంత సున్నితమైన అంశం.
ReplyDeleteబట్టలు ధరించటమనేది సమస్త జంతుజాలంలోనూ కేవలం మనుష్యులకే ప్రత్యేకమైన విషయం.
అనాదిగా ఆడవాళ్ళకు ప్రత్యేకమైన గుర్తింపు చిహ్నంగా అందం పరిగణించబడుతోంది.
అలాగే మగవాళ్ళకు ప్రత్యేకమైన గుర్తింపు చిహ్నంగా తెలివితేటలు పరిగణించబడుతున్నాయి.
నిజానికి ఇలా ఆలోచించటం వివక్ష క్రిందకే వస్తుంది. అందచందాలూ, తెలివితేటలు అనేవాటికి ఆడా మగా అనే తేడా లేదు. కాని సమాజంలో యెంతగా నాగరికతా వికాసం జరిగినా, ఈవిధమైన వివక్ష ఇంకా ఆమోదం పొందుతూనే ఉండటం విచిత్రమే కాదు, విచారకరం కూడా.
స్త్రీలు కూడా తమ తమ అందచందాలతోనే హెచ్చు గుర్తింపు అని ప్రాకులాడటం అక్షరాలా తమను తాము కించ పరుచుకోవటమే.
తరచు సమాజంలో సభలూ సమావేశాలలో స్త్రీలు అతిగా అలంకరించుకోవటామూ, పురుషులు అతిగా తెలివితేటలు ప్రదర్శించుకుంటూ తిరగటమూ చూస్తునే ఉన్నాము. అవి అవసరమా?
మగవాళ్ళు విదేశీ వస్త్రధారణపేరుతో చివరికి కంఠం కూడా కనబడకుండా బిగించి తెగ దుస్తులు ధరిస్తారు.
ఆ ప్రక్కనే స్త్రీలు అధునాతన వస్త్రధారణ పేరుతో అతిపొదుపుగా దుస్తులు ధరించి కనిపిస్తారు.
తమకు నచ్చినట్లుగా దుస్తులు వేసుకోవటం స్త్రీ స్వాతంత్ర్యం అనుకునే ఆడవాళ్ళు తమను తాము ఆటబొమ్మల్లా ప్రదర్శించుకోవటం తమ వ్యక్తిత్వాలను కించపరచుకోవటం కాదా అన్న విషయం యెందుకు ఆలోచించరు?
పైన ఉన్న ప్లకార్డు ప్రకారం మా యిష్టం మేము బట్టలు మాకు నచ్చినట్లు వేసుకుంటాము మీరు మా జోలికి రాకండి అంటున్నారు. మంచిది. ఎబ్బెట్టుగా ఉన్నా ఒక మాట అనక తప్పదు - దాదాపుగా బట్టలు విప్పుకుని ఆడది తిరుగుతూ ఉంటే మగవాళ్ళు మహాయోగుల్లా నిశ్చలంగా ఉండాలంటున్నారా? అడగటం బాగానే ఉంది, కాని సమస్త పురుషప్రపంచమూ కేవలం యోగులై ఉండాలని ఆదేశించటం కుదురుతుందా?
ప్రురుషులలో కొందరి వలన యీ విషయంలో స్త్రీలకు యెలా అసౌకర్యం కలుగుతున్నదో, అలాగే స్త్రీల అతిపొదుపు వస్త్రధారణ వలన పురుషులలో అనేకమందికి అసౌకర్యం కలుగుతున్నదని స్త్రీలు గ్రహించటం బాగుంటుంది. మీ అసౌకర్యంతో మాకు పనిలేదు మా వస్త్రధారణ మాహక్కు అని స్త్రీలు అనటమూ, మీ అసౌకర్యంతో పనిలేదు మా చేష్టలు మాయిష్టం అని పురుషులు అనటమూ రెండూ సమానమైన తప్పుడు భావనలేనని అందరూ గ్రహించాలి.
ఆడవాళ్లకు తమ శరీరాల్ని ప్రదర్శనకు పెట్టే స్వాతంత్ర్యం ఉన్నప్పుడు, మగవాళ్లకు వాళ్ళ అవకాశాలను వినియోగించుకునే స్వాతంత్ర్యం ఉండదా?
రెచ్చిపోవటం యెంత తప్పో, రెచ్చగొట్టటం అంత తప్పు కాదా?
కాబట్టి వస్త్రధారణ యొక్క మూల ప్రయోజన్నాన్ని మనం స్మరించుకుంటే బాగుంటుంది.
>>ఆడవాళ్లకు తమ శరీరాల్ని ప్రదర్శనకు పెట్టే స్వాతంత్ర్యం ఉన్నప్పుడు, మగవాళ్లకు వాళ్ళ అవకాశాలను వినియోగించుకునే స్వాతంత్ర్యం ఉండదా?
Deleteకావాలంటే మీకూ బట్టలిప్పుకుని తిరిగే స్వాతంత్రం వుందని చెప్పండి. అంతే కాని వాళ్ళ అవకాశాలను వినియోగించుకునే స్వేచ్చ వుందనేది సిగ్గుమాలిన వాదన. Your freedom ends where other's nose begins రేపులు చేసే స్వేచ్చ పశువులు కూడా ఆశించవు, ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి.
అనానిమస్ గారు పొరబడుతున్నారు.
Deleteస్వాతంత్ర్యం అనేదానికి ఇరుపక్షాలూ ఒకే కొలబద్ద వాడాలని యెలా విధించగలరు?
ఒక వర్గం వారు ఒక విషయంలో తమ యిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించటం తమ స్వాతంత్ర్యం పరిధిలోని విషయం అనుకుంటే, అవతలి వర్గం వారు తమ స్వాతంత్ర్యానికి తమ తమ అబసరాలూ అవకాశాలు ప్రాతిపదికగా వేరొక రకంగా అర్థం కుంటే? ఒక పక్షం వాదనని మనం అంగీకరించినప్పుడు, అవలి పక్షం అలా స్వాతంత్ర్యానికి స్వీయార్థం చెప్పుకోకూడదని నిషేధంచే అవకాశం మనకు లేదని అనానిమస్ గారు గ్రహించ లేదు.
ఇక పోతే, విషయానికి కట్టుబడి అభిప్రాయాలు హుందాగా వెలిబుచ్చటం, ఆరోగ్ర్యకరమైన సంప్రదాయం. దురుసుగా మాట్లాడినంత మాత్రాన అభిప్రాయం బలంగా చెప్పటమూ, ఇతరుల అబిప్రాయాలను బలంగా తిరస్కరించటం అవుతుందనుకోవటమూ సరికాదు. ఇటువంటి అసమంజస ధోరణి అంతర్జాలంలో విస్తృతంగా కనిపిస్తూ ఉండటం దురదృష్టకరం. ఇంతకంటే చెప్పవలసినది లేదు. సిథ్థాంత పరమైన చర్చ చేయదలచుకున్నప్పుడు శేషం కోపేన పూరయేత్ అన్నట్లుగా విరుచుకు పడే వారితో వాదన కుదరదని అనానిమస్ గారు గ్రహించాలని కోరుతున్నాను.
రేపులు చేసే స్వేచ్చ పశువులు కూడా ఆశించవు, ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి అన్నది పూర్తిగా సరికాదు. దీనిపై మరింత వ్యాఖ్యానించ దలచుకోలేదు.
స్త్రీ, పురుషులు సమానులైనపుడు సమన్యాయం, ఒకే కొలబద్ధ ఎందుకు వుపయోగించకూడదు? మీరు దురుసుగా ఎందుకు వూహించుకుంటున్నారు? It is shameless (సిగ్గులేని) to say that men are justified to loose control on seeing a women with scanty dress and break law. ఇంగ్లీషులో అంత దురుసుగా అనిపించట్లేదు కదా. అసభ్యవస్త్రధారణ, అంగాంగ ప్రదర్శన ఆక్షేపణీయం. మీకు తెలుసో లేదో, అసభ్య వస్తధారులు మాత్రమే అత్యాచారాలకు గురి కావడం లేదు, ఢిల్లీ రేప్ భాధితురాలు నార్త్ ఇండియన్లు వేసుకునే చుడీదార్ పైజామానే వేసుకుందిట. ఈమధ్య పేపర్లలో వచ్చిన 5ఏళ్ళ పిల్ల అసభ్య వస్త్రధారణ వల్ల రేప్‌కు గురి కాబడలేదు. చీటికీ మాటికీ విప్పుతా అని బెదిరించే పూనం పాండే, రాఖీ సావంత్‌లు అత్యాచారానికి గురైనట్టు కానము. అంచేత మీరు డ్రస్ వేసుకోకుంటే మగాళ్ళు రెచ్చిపోవడం న్యాయమే అంటే శ్యామలీయం బాబాయ్ గారే జస్టిఫై చేశారు అని కుర్రాళ్ళు రెచ్చిపోగలరు. పశ్చిమ దేశాల్లో మన వేదభూమిలో జరిగినన్ని రేపులు జరుగట్లేదు. బురఖా వేసుకున్నా పాకిస్థాన్లో అత్యాచారాలు, ఆసిడ్ దాడులు ఆగట్లేదు."షం కోపేన పూరయేత్" మీరు వాదించకపోతే మాపొద్దు గడవదు అని మీరు భ్రమ పడడం విచారకరం. జవాబు ఇవ్వని కామెటర్లనెవరూ అత్యాచారాం చేస్తామని బెదరించలేరు. ఇవ్వకపోయే స్వేచ్చ, స్వాతంత్రం వారికెప్పుడూ ఉంటుంది. సెలవు
Deleteఅనానిమస్ గారూ,
Deleteమీ అభిప్రాయాలతో నాకు సమభావం ఉన్నది.
ఒకే కొలబద్ద ఉపయోగించటం సబబా కాదా అన్నది కాదు ప్రశ్న. కొలబద్దల్ని యెవరు నిర్వచిస్తారనేది. ఇరువైపులవారు తమ కొలబద్దల్ని తాము ప్రామాణీకరించునే ప్రమాదం గురించే నేను ప్రస్తావించాను.
డ్రస్ వేసుకోకుంటే మగాళ్ళు రెచ్చిపోవడం న్యాయమే అని నేను జస్టిఫై చేయటం లేదని గ్రహించగోర్తాను.
వస్త్రధారణ అనేది ఒక అంశం మాత్రమే అని నా అభిప్రాయం. ఇది లోగడే చెప్పాను కదా.
"స్త్రీ, పురుషులు సమానులైనపుడు సమన్యాయం, ఒకే కొలబద్ధ ఎందుకు వుపయోగించకూడదు?"
Deleteస్త్రీ, పురుషులు సమానం అని మీరనేస్తే సరిపోతుందా? వారేలా సమానం? మగవారేప్పుడు, ఆడవారితో పోటి పడుతూ మన ఇద్దరం సమానం అని పోల్చుకోడు. వాడికి ఆ దుగ్ద లేదు. అలాగని వారికి స్రీ, పురుషులు సమానం కాదు అని ఖండించే అవసరం అతనికి లేదు. ఈ సమానత్వ వాదన అంతా ఆడవారు చేసే యాగి/గోల. ఏ విషయం లో మీరు మగవారితో సమాన మబ్బా? ఇద్దరం మనుషులుగా పుట్టాం కనుక సమానమని మీరు అనుకొంటే ఆ వాదనను టపాలు రాసుకొని మురిసిపోండి.
అయ్యా, అనానిమసుగారూ, ఒకే కొలబద్దగురించి నేనన్నది మీరు సరిగా గ్రహించలేదని తోస్తున్నది. ఒకఏ కొలబద్ద ఉపయోగించ వచ్చునా, లేదా, అన్న విషయం చర్చ చేయటం లేదు నేను. మరొకసారి నా మాటలు పరిశీలించండి.
Deleteసమానత్వ వాదన అంతా ఆడవారు చేసే యాగీ లేదా గోల అన్నది తప్పుడు అభిప్రాయం. ఆడవారి హక్కుల విషయంలో చొరవ, శ్రథ్థ చూపించిన ప్రముఖులలో హెచ్చు మంది మగవారేఅన్నది మీరు మరచిపోతే యెలా?
ఈ విషయంలో మరింత దీర్ఘంగా చర్చించటానికి నాకు అభ్యంతరం లేదు గాని, ఆ అవసరం కనిపించటం లేదు. కాబట్టి యీ చర్చకు యిక స్వస్తి పలకటం మంచిదిగా భావిస్తున్నాను.
అయ్యా, చర్చకి ఇలా స్వస్తి పలకటం బాలేదు.
Deleteఈ పై అనానిమస్సు తో నేను ఏకీభవిస్తున్నా. సమాజంలో సమానత్వం రావాలి. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని మానభంగం చేసే సమానత్వం వచ్చే వరకు ఉద్యమించాలి.
ReplyDeleteశ్యామలీనం గారు బాగా చెప్పారు.
ఇక్కడ ఈ అమ్మాయిలూ, ఆ మీడియా వాళ్ళు అర్థం చేసుకోని విషయం ఏటంటే,
ఈ అమ్మయిలు చదువుకున్న వాళ్ళు..వీళ్ళకి చెపితే అర్థమవుతుంది కాబట్టి వీళ్ళకి బట్టల విషయంలో చెబుతున్నాం...... అవతల ఆ మూర్ఖులు సన్నాసులు... వాళ్ళకి చెప్పినా ఉపయోగం లేదు. వాళ్ళని రెండు దెబ్బలు వెయ్యటమే మార్గం..
కాబట్టి ఈ ప్లకార్డులూ, స్లోగన్లు (Don't tell us.. tell them..) కొవ్వొత్తులు వృధా అన్నవిషయం ఎవరూ గమనించట్లా!
దుస్తుల విషయం లో ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు కూడా ప్రముఖ మైన పాత్ర వహిస్తాయి. కేవలం అందం గా కనిపించడం కోసం కాక, సౌకర్యం అన్నది కూడా వస్త్ర ధారణ ని ప్రభావితం చేస్తుంది అన్నది మరచిపోకూడదు. రేపిస్టులు ఎవరు డ్రెస్ చూసి రెచ్చిపోయిన వారు కాదు. విలువలు కళ్ళల్లో ఉండవు. బుర్రలో ఉంటాయి.
ReplyDeleteసంప్రదాయ వస్త్ర ధారణ రేపిస్టులను ఆలోచింప చేస్తుంది అనడం పనిలేని వాదనలు.
చక్కగా చెప్పారు.
Deleteవస్త్రధారణలో సాంప్రదాయిక ధోరణికి కట్టుబడటం అనేది దుష్టులను పూర్తిగా దూరంగా ఉంచుతుందని చెప్పలేం. కాని, ప్రోత్సహించేదిగా ఉండదని చెప్పవచ్చుననుకుంటాను. నిజానికి యే మహిళా ప్రురుషులను తమపైకి దాడికి ప్రోత్సహించే విధంగా అస్త్రధారణ చేయాలని అనుకోదు - అలా అనటం చాలా చాలా అన్యాయం కూడా. కాని, అసంకల్పితంగా బలహీన మనస్కులకు దురాలోచన రేకెత్తే విధంగా తమ వస్త్రధారణ ఉండరాదని మహిళలు గ్రహిస్తే మంచిదే కదా.
ఇక్కడ వస్త్రధారణ అన్నది ఒక అంశం మాత్రమే. అమ్మాయిలు జాగ్రత్త తీసుకోవలసి అంశాలలో అది ఒకటి మాత్రమే.
మీరు ప్రొఫైల్లో మీ ఫోటో ఎందుకు పెట్టుకోలేదు? ఏదో భయం అనుమానం, అంతేకదా. పెట్టుకోకపోవడం ద్వారా ఏదో అనర్థాన్ని ఆపగలగడం అని గుర్తించారు, లేకుంటే మోడ్రన్ డ్రస్సులో ఎన్నో ఫోటోలు పెట్టుకునే వారు కదూ? that's it
Deleteఅజ్ఞాతా నువ్వు పేరు కూడా పెట్టుకోలేదు మరి :) మీకు ఏమి భయం, ఏమి అనుమానం :)
Deleteఏమవుతుంది ఫోటో పెడితే??? నాకు అవసరం కనిపించలేదు కాబట్టి నా ఫోటో లేదు.
అంతే కదా, మీరిద్దరూ పిరికివాళ్ళే.
Deleteఅందుకే మిమ్మల్ని లెక్క చెయ్యడం లేదు కదు :)
Deleteబుచ్చమ్మ, పెద్ద ఆరిందానిలాగా అభిప్రాయాలు వెల్లడిస్తుంది. ఆడవారికి "వలువల" అవసరం లేకపోతే మగవారికి "విలువలు" అవసరమా? ఎమీటా దుస్తులలో ఉండే సౌకర్యం, హై హీల్స్ చొప్పులు, మినిలు వేసుకొని తిరగటం సౌకర్యమా? ఫాషన్ పెరిగి, పెరిగి , ముదిరి ఇప్పుడు అమ్మాయిలు జీన్స్ పాంట్ వేసుకొంటే, పాంటిలను వేసుకోవటం కూడా మానేసారు. వాళ్లు పైనా, కిందా చూపిస్తూంటే, బుర్రలో విలువలను ఉంచుకొని మగాళ్లు ఉండాలని ఆశించటం హాస్యాస్పదం. మధ్య తరగతి మగవాడైతే బాత్రూం లో దూరి ఊహా ప్రపంచంలో ఐదు నిముషాలలో పని ముగించి, బుద్దిమంతుడి గా బయటికి వస్తాడు.పేదరికంలో మగ్గుతూ , కారు,బస్సు లు నడిపేవారికి ఇటువంటి పనులు చేస్తే పోయేదేమి లేదు. అందువలన తెగించి పారేస్తారు. దీనికి తోడు ప్రభుత్వం ప్రజలకు తాగుడిని బాగా అలవాటు చేయించింది.తాగుడు కూడా ఇటువంటి సంఘటనలకు ఒక ప్రధాన కారణం. వాళ్లని ఎంత మందిని ఉరి తీసినా వీటిని ఎవ్వరు ఆపలేరు.
ReplyDeleteఅత్యాచారానికి గురవుతున్నవారిలో చాలా మంది రెక్కాడితే డోక్కాడని, ఆధునిక వస్త్రధారణకు తాహతులేని కూలీ జనాలే అన్నది నీవు గుర్తించాలి.
Deleteనేను గుర్తించాను గాని నువ్వు వేళ్లి కోర్ట్ ల సంఖ్య పెంచి శిక్షించమని ప్రభుత్వాన్ని చెప్పుకోండి.
Deleteచూడు బుచ్చయ్యా మగకుక్క బుద్ధి మారనిది ఎన్నికోర్టులున్నా ఏజేయగలవు? లాయర్లను, పోలీసులను మేపడానికి తప్ప? అందుకే నీతో చెప్పుకుంటున్నా, నువు మారాల.
Deleteబుచ్చమ్మా, తింగరి బట్టలేసుకు తిరిగేటొల్లకి సెక్యూరిటీ బానే వుంటది..
Deleteఆళ్ళని చూసి రెచ్చిపోయి మదపిచ్చితో తిరిగేటోడికి,
రాత్రుళ్ళు వొంటరిగా దొరికే అభాగ్యులే బలవ్తున్నారు..ఆ ఇషయం తెల్సుకో!
ఆడదానికి ఆడదే శతృవంటే ఇదే!
బుచ్చమ్మా,
Deletehttp://www.firstpost.com/wp-content/uploads/2012/12/a5.jpg
పై ఫోటోలో ఎక్తా కపుర్ ని చూడు,ఆమేమో పై భాగాన్ని ప్రేక్షకుల కనువిందుకొరకు కేమెరాకు అప్పగించింది. ఆమేకి ఒక 500 కోట్ల పైన వ్యాపారం ఉంది. రేపు ఈ పోటొను పేపర్ లో చుసి పులిని చూసి నక్క వాత పెట్టుకొన్నట్లు, ఇటువంటి డ్రెస్ లు తొడుకొని డిల్లి,బాంబేయ్,బెంగుళురు, గల్లీలలో చాలా మంది పోరులు తిరుగుతూంటారు. తిరిగిన వారందరిని మగవాళ్లు రేపింగ్ లు చేయకపోయినా, అవకాశం దొరికితే మాత్రం గట్టిగా ప్రెస్సింగ్ లు చేసేస్తారు. జ్యోతికా నే ఒకడు ప్రేస్సింగ్ చేసి యుట్యుబ్ లో వీడియో పెట్టాడు. కుక్క బుద్దిగల మగవారు ఆడకుక్క అనుమతి కొరకు తోక ఊపుతు, వాసన చూస్తూ పనిలోకి దిగుతుంది. కుక్క బుద్దిగలవాడు పెళ్లి చేసుకొని వాడి కుతిని తీర్చుకొంటాడు. సంస్కారులు, సంసారులు మగవారందరు కుక్క బుద్దిగలవారనుకొంటే ఎలా? మనిషి ఒక జంతువు. కుక్కల సంఖ్య ఎక్కువ ఉండవచ్చేమో గాని, లెక్కించదగ్గ సంఖ్యలో పులులు,సింహాలు, తోడేళ్లు మొద|| మృగాలు ఉంటాయి.అప్పుడప్పుడు అలాటోళ్లు తలిగిలితే ఏఫేక్ట్ డిల్లి లో జరిగిన సంఘటనలాగుంట్టుంది.
మీ మిత్రుడు
సింహ
This comment has been removed by a blog administrator.
Delete'ఎప్పటికెయ్యది ప్రస్తుమప్పటికా మాటలా'డటం అవసరం. మన తీర్పులు, తీర్మానాలు బాధితులకు సాంత్వన కలిగించేవిగా, వారిపక్షం వహించేవిగా ఉండాలేగానీ వైరిపక్షం వహించేవిగా జరిగిన ఘోరాన్ని కారణీకరించేవిధంగా కొండొకచో సమర్ధించేవిగా ఉండరాదు.
ReplyDeleteమహిళలు సాంప్రదాయక దుస్తులు ధరించేసాంప్రదాయం నుండి వైదొలగారు అన్నది వేరేవిషయం. తత్కారణంగా వారిపైజరిగే అత్యాచారాలకు నైతికతను ఆపాదించే ప్రయత్నాలు గర్హనీయం. రెండూ కూడనిపనులే. ఒకటి ఖండనార్హం, రెండొది శిక్షార్హం.
ఇదే తర్కానికి కొనసాగింపుగా "మీరు సరైన తాళలు వాడటంలేదుకాబట్టి, మీ ఇంటలో దొంగతనానంచేసే హక్కు దొంగలకుంది" అనో, "అందుకే దొంగతనం జరిగింది" అనో పోలీసులు వ్యాఖ్యానిస్తే, తప్పుమీదేనంటూ మీకే మార్గదర్శకాలు జారీచేయాలని ప్రయత్నిస్తే అది మీరు సబబంటారా అనేది మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న.
Good point, right example
Deleteసరైన తాళాలు వాడకపోతే దొంగతనం చేసే హక్కు ఉండదు కాని, దొంగతనం జరిగే సంభావ్యత పెరుగుతుంది. అలాగే తలుపుకి తాళాలు వేసినా, కిటికీలు తెరిచి ఉంచితే చిల్లర దొంగలకు కూడా అవకాశం దొరుకుతుంది. ఇక, తలుపులు బార్లా తెరుచుకొని బయటకు వెళ్తే, దారిన పొయే వాళ్ళలో ఆశబోతులు చాలామంది ఉంటారు. ఇల్లు గుల్లవుతుంది.
Delete"మన తీర్పులు, తీర్మానాలు బాధితులకు సాంత్వన కలిగించేవిగా, వారిపక్షం వహించేవిగా ఉండాలేగానీ..." నిజమే, ఒప్పుకుంటాను. ఇది జరుగుతుంది కూడా. దాంతో పాటూ, మనం నిజాలు కూడా మాట్లాడు కోవాలి (ఈ చర్చ అంతా బాధితులతోను, వాళ్ళ ఎదురుగా జరగడం లేదని గమనించండి). అప్పుడే పరిష్కార దిశగా ముందుకు వెళ్ళవచ్చు.
మీ వస్త్రధారణ మీపై అఘాయిత్యాలకు కారణమయ్యింది అనిచెప్పడం 'జాగ్రత్త'గా ధ్వనించినంతవరకూ ఫర్వాలేదు. జాగ్రత్తలు జారీచేసేహక్కు ప్రభుత్వానిక్కూడా ఉంటుంది. కానీ దాని 'సాకు'గా వాడుకోకూడదని నావుద్దేశం. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అలా వ్యాఖ్యానించడం ఎవరికి స్థైర్యాన్ని కల్పించడానికి, ఎవర్ని అనునయించడానికి?
Deleteకానీ ఇక్కడ 'సరైన తాళాలు వాడక'పోవడం మీదే తప్పు అంటూ దొంగల తరఫున మాట్లాడినట్లుగా మాట్లాడారు కొందరు. ఇదేరకంగా బ్యాంకునో, లేక ఇంకొకరి ఆస్తినో దొంగిలించిన దొంగలు వాదిస్తే, మనం దొంగలను 'అర్ధం చేసుకొని' వదిలిపెడతామా?
'సరైన వస్త్ర ధారణ ఏది' అన్న చర్చంటూ వస్తే ఏభాగాన్నీ బయటకు చూపించని బురఖా సరైనదిగా మిగులుతుంది. దీనికి కొనసాగింపుగా మగవాళ్ళుకూడా కవచాలు వేసుకొని బయట తిరగాల్సుంటుంది ( 'మీరు రక్షణలేకుండా తిరిగి మమ్మల్ని రెచ్చగొట్టారు కాబట్టి మేము దాడిచేశాము' తరహా).
Kishore is 100% correct.
DeleteThis comment has been removed by a blog administrator.
Deleteఆధునికత పేరుతో కొంత మంది వస్త్రధారణ శ్రుతి మించుతుంది అనేది నిజం. పైగా మా శరీరం మా ఇష్టం, ఇది మా స్వేచ్చకు ప్రతీక అని వాదిస్తున్నారు. మరో వైపు సినిమాల్లో కూడా ' గ్లామర్ ' విపరీతంగా పెరిగిపోయింది.
ReplyDeleteమేం బట్టలిప్పుకొని తిరుగుతాం కాని, మీరు రేప్ చేయకూడదు అనడం సరి కాదు. బట్టలిప్పినా పర్వాలేదు, ఏదో పిచ్చోల్లనుకొని జాలి పడతారు. కాని, మీరు ధరిస్తున్న దుస్తులు ఉన్నాయే, స్త్రీ శరీరంలొ ఏవైతే పురుషునికి కామోద్రేకం కల్గిస్తాయో, వాటినే ప్రత్యేకంగా చూపిస్తాయి. పడకటింట్లో భర్తకి మాత్రమే ఆహ్లాద పరచవలసిన అందాలు, బహిరంగంగా వీధుల్లో ప్రదర్శిస్తే, వాటికోసం ఆశ పడేవాళ్ళూ ఉంటారు. అందరూ సంస్కారవంతులు ఉండాలని ఆశించడం అత్యాశే.
ఇలాంటి ' గ్లామర్ ' ప్రదర్శనలు ఒక సర్కిల్ లోనో, కొన్ని సమాజాల మధ్యనో పరిమితం కావట్లేదు. రక రకాల మాధ్యమాల ద్వారా అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. దాంతో ఈ ' స్వేచ్చ ' గురించి తెలియని వాళ్ళూ, బలాదూర్ గా పెరిగిన వాళ్ళు, మానసిక బలహీనతలు, శారీరక బలం ఉన్నవాళ్ళు, స్త్రీలపై చులకన భావం పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ అత్యాచారాలు.
విచారించవలసింది ఏమిటంటే, ఎక్కువగా బలయిపోతుంది అమాయకులు, బలహీనులే. ఎందుకంటే, ఈ సోకాల్డ్ స్వేచ్చావాదులకి తగినంత రక్షణ ఉంటుంది. ఎటొచ్చీ, బజారులో తిరిగే రాక్షసులకి అందుబాటులో ఉండేది, బలయ్యేది మద్యతరగతి వాళ్ళూ, పేదలే.
మేం బట్టలిప్పుకొని తిరుగుతాం కాని, మీరు రేప్ చేయకూడదు అనడం సరి కాదు.
Delete:O then? "Whenever we undress or change dress, you have right to rape" is this what the CORRECT way of saying?
Have u not watched tha placards in the hands of some girls protesting at India Gate? They read "Even if I walk BARE on the road u have no right to RAPE us"!!!!!
Delete@ బులమ్మ గారు...
Deleteఆడవాళ్ళు వివస్త్రులై రోడ్ల మీద పడినా వాళ్ళను ముట్టుకో కూడదు, పట్టుకోకూడదు అసలు పట్టించుకోకూడదు అనే అర్ధం వచ్చేలా "డిల్లీ" వీధుల్లో భారతీయ స్త్రీజాతి (ఆధునిక స్త్రీ) పోష్టర్లు పట్టుకొని తిరగటం అన్ని "టీవీ" చానల్స్ లోనూ చూపారు...
మీరు ఎలా తిరిగినా మిమ్మల్ని పట్టించుకోకుండా తల దించుకొని పోవడానికి మీరు ఉన్నది ఆది మానవుల కాలం కాదు, అడవి అంతకన్నా కాదు.. మీరు పశువులు కాదు...
రోడ్డు మీద ఒక ఆవు/గేదె నగ్నంగా కూర్చొని గడ్డి తింటూ ఉంటుంది, దాన్ని ఎవరూ పట్టించుకోరు. ఇదేంటి అని ప్రశ్నించరు, ఇక్కడ మీరు (స్త్రీలు) ఆ పశువులు ఒక్కటేనా..! కాదుగా..? మన హిందూ సాంప్రదాయంలో ఆవుకు ఎంత విలువ.. పవిత్ర స్థానం ఇస్తారో, స్త్రీకీ దాదాపుగా అంతే స్థానం ఇస్తారు, అలాగని మీరు అది ఒకటి కాదుగా...?
పద్ధతులను పక్కన పెట్టి, బారి తెగించి బరిలో దిగితే అచ్చోసి వదిలేసినా ఆంబోతులు - తల దించుకొని వెళ్ళవు.. వాటి పని అవి చేస్కొని వెళ్ళిపోతాయి (అదే అత్యాచారం), వాటిని పట్టుకొని కట్టేయాల్సిన పాలేరు (ప్రభుత్వం) చాతకాని వాడాయే, ఏమి చేసేది ? ఎలా మిమ్మల్ని కాపాడేది...?
మిమ్మల్ని మీరు రక్షించుకోవాలన్నా, మేము మిమ్మల్ని రక్షించుకోవాలన్నా మీరు పశువుల్లా కాకుండా మనుషుల్లా మనిషి (మా) మాట వినాలి...
పశువులకు మనుషులను అర్ధం చేస్కోనేంత బుద్ధి జ్ఞానం లేవు, కాని మహిళలకు పురుషులు చెప్పేది అర్ధం అవుతుంది కదా..! పోనీ పురుషులను వదిలేద్దాం.. పెద్దలు (అందులోనూ స్త్రీ పెద్దలు) చెప్పేది వినవచ్చును కదా...?
వినరు.. మీరు ఎవ్వరి మాట వినరు, మీ మాటే అందరూ వినాలి అనుకొనే మూర్ఖత్వం ఇంకెంత కాలం ? స్త్రీ మనుగడకు మచ్చ వచ్చే దాకానా ? ఆధునిక స్త్రీల వల్ల నా కన్న తల్లిని ఒంటరిగా బయటకు పంపాలన్నా భయపడాల్సిన పరిస్థితుల్లో ఉన్నాను నేడు...
నిజానికి ప్రత్యక్షంగా ప్రమాదం వచ్చేది - మగ మృగం నుంచి కాని ఆడ కేడీల వేషాలు నాకు తెలియనివి కావు, అందరూ అలా ఉంటారని నేను అనను కాని చాలా మంది అలానే ఉన్నారు...
చీరలు దాదాపు కట్టారు - కట్టినా పైట వేయాల్సిన చోట వేయరు, వేరే చోట ఎక్కడో వేస్తారు.. ఇంకెందుకు వేయడం ? కప్పుకోవాల్సినవన్నీ కనపడిపోతుంటే...! పంజాబీ డ్రస్సులు వేస్తారు...
వాటి మీద చున్నీలను పీకకు చుట్టేస్కోని తిప్పుకుంటూ రోడ్లు ఎక్కేస్తారు, చున్నీ ఇచ్చింది మీ పరువుని కాపాడుకోవడానికి, కప్పుకోవడానికి కాని పీకకు చుట్టుకోవడానికి కాదు.. అది చాలా మంది అమ్మాయలకు తెలియనే తెలియదు...
సినిమాలు సగం చెడగొడితే, ఆధునికత స్త్రీని పూర్తిగా చెడగోట్టేసింది.. నేనింతే..! నేకుందుకు, నేనెలా ఉంటె ? అనే స్థాయికి చేరుకుంది పైత్యం.. దీనికి విరుగుడు ఉందొ లేదో ఆ దేవునికే ఎరుక...
స్త్రీలు అంగాలను ప్రదర్శిస్తే పురుషులకు ఆ స్త్రీలను అత్యాచారం చేసే హక్కు ఉనట్టు కాదు, మగాడు అలాంటి చెత్త పనులు చేయడు కాని మృగం ఆ పని చేస్తుంది...
అది తెలివైన మృగం, మాటు వేసి కాటేస్తుంది.. చాటుకు లాక్కెళ్ళి చీరేస్తుంది.. పంటి గాటు క్రింద పాతేస్తుంది.. ఘోరం జరిగిపోయాక ప్రపంచానికి తెలిసినా చేసేదేముంది ? చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అవసరమా...?
ముందే మేలుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి - మృగాల వేటకు చోటు ఇవ్వకండి, మిమ్మల్ని మీరు కాపాడుకోవడం నేర్చుకోండి.. సమాజాన్ని నిందించే ముందు, మీరే స్థితిలో ఉన్నారో ఒకసారు ఆత్మపరిశీలన చేస్కొని అప్పుడు రోడ్ల మీద పాదయాత్రలు చేయండి...
తప్పు మనలో ఉంచుకొని సమాజాన్ని నిందిస్తే ? ఎవరేం చేయగలరు ? మిమ్మల్ని చూసి నవ్వడం తప్ప జరిగేదేమి లేదు.. మీరు నవ్వులపాలు అవ్వడంతో పాటు స్త్రీజాతిని నవ్వులపాలు చేస్తున్నారు...
మారండి - మార్చండి - మార్చుకోండి...! విశ్వ..!
కాని మహిళలకు పురుషులు చెప్పేది అర్ధం అవుతుంది కదా..! పోనీ పురుషులను వదిలేద్దాం.. పెద్దలు (అందులోనూ స్త్రీ పెద్దలు) చెప్పేది వినవచ్చును కదా...?
DeleteThis is male chauvinism. Insulting women on Women's day.
*is this what the CORRECT way of saying?*
ReplyDelete*స్త్రీలపై చులకన భావం పెంచుకుంటున్నారు*
స్త్రీల పైన గౌరవభావం పెంచుకోదగ్గ చరిత్ర వారికేమి ఉంది? వారిని గౌరవించటానికి. ఈ కాలపు వారికి సంస్కృతి అంటే పడి చావదాయే. ఏ డ్రెస్ వేసుకొన్నా యక్స్ పోసింగ్ ముఖ్యమాయే. పెళ్లిళలో చూడటం లేదా, సాంప్రదాయం పేరుతో చీరకట్టుకొన్నా, చిన్న 15 -50 సం|| వరకు వీపును మొత్తం చూపించే జాకేట్లు వేసుకొని తిరుగుతూంటారు. వీళ్లలో మేధావులు ఎవరైనా ఉన్నారా అంటే వారుఅసలికేలేరు. మేట్ట మేధావులు సీతా, సావిత్రులు మొ|| పతివ్రతలందరిని, దద్దమలు గా చిత్రికరిస్తూ స్రీ సాహిత్యం సృష్టించుకొన్నారు. వారి జాతి లో గర్వించదగ్గ మహిళలు ప్ర`వీరికి ఎవ్వరు లేరు. వీళ్లకు ఎమైనా ఆధునిక చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందా అంటే అది లేదు. పురుషులు పది సార్లు ఒక పని చేసిన తరువాత పదకొండో సారి, ఆ బాటలో ప్రయాణించి నేడు మహిళలు కూడా పురుషులతో సమానం గా ప్రతి రంగంలోను దూసుకేళ్లుతున్నారు అని డాబ్బా కొంట్టుకొంటారు.
బుల్లెమ్మా,
వాదించినవరకు చాలు. ఆయన రాసినదానిలో ఒక లైన్ పట్టుకొని పెడ అర్థాలను పీకమాకు. మీ ఇష్ట్టమొచ్చినట్లు ప్రవర్తించండి ఎవరు వద్దన్నారు.
అన్నయ్యా, నీవు నిక్కర్లేసుకుని చారల షర్టులేసుకుని, పచ్చప్యాంటు, పసుపు కోటు వేసుకుని జూ ఎంటిఆర్‌లా, గున్నేనుగులా అంగలేసుకుని నడిస్తే మేమెప్పుడన్నా వద్దన్నామా? ఎందుకురా మేమంటే నీకంత కచ్చి? నీవు సైటు కొట్టే బోండాం వదినెమ్మలు మాత్రం అరకొర దుస్తులేసుకోవాలంటావ్. నీకొక న్యాయం నీ కాబోయే బావలకొక న్యాయమా?
Deleteఇట్లు నీ చెల్లి
బుల్లెమ్మ
చిట్టి చేల్లేమ్మా!
Deleteచాలా చక్కని ప్రశ్నలు వేశావు. చాలా సంతోషంగా నవ్వుకొన్నాను.ఇక మీ ఆ ప్రశ్నలకి సమాధానం ఇచ్చేముందర నా సీరియస్ సమాధానం విను " మీరు నేను సూటిగా వేసిన ప్రశ్నలకు ఒక్క సమాధానం ఇవ్వలేదు. మౌనం అంగీకారంగనుక నేను పైన రాసినవాటికి మీదగ్గర సమాధానం లేదు అని అనుకొంట్టున్నాను. ప్రస్తుతానికి నా వాదన పైచేయి సాధించింది"
********
"ఎందుకురా మేమంటే నీకంత కచ్చి?"
చెల్లెమ్మా! నీ మీద నాకెందుకే కోపం. ఎవరైనా మనతో ఉంట్టున్నావారు తెలివి తక్కువ పనులు చేసి, చిక్కులు తెచ్చుకొని, అవమానాలపాలైతే తోటి అన్నగా కొంత బాధ ఉంట్టుంది కదా! అంతే. నువ్వను కొన్నట్లు జూ||యం.టి.ఆర్.లాగా ఉండను. ఆ మాట కొస్తే ఏ తెలుగు హీరో లాగా ఉండను. మీ ఊహ గురి తప్పినందుకు ఎమీ చేయలేను చిట్టిచెల్లెమ్మా
"నీవు సైటు కొట్టే బోండాం వదినెమ్మలు మాత్రం అరకొర దుస్తులేసుకోవాలంటావ్"
పొరబడ్డావు చెల్లెమ్మా! నేను ఆవిధంగా అనలేదు. పని వత్తిడి వలన, ఆంధ్రదేశానికి దూరంగా ఉండటం వలన పెళ్ళిళకు పోను. మా అమ్మా,ఆవిడా, అక్కలు పోయి వచ్చి మారిపోయిన స్రీ సమాజం గురించి వివరిస్తూంటారు. మంచి కొడుకు,భర్త , బ్రదర్ అనిపించుకోవాలంటే ఇంట్లో ఆడంగులు చెప్పేది శ్రద్దగా,బుద్దిగా పది నిముషలైనా వినాలి కదా! వినకుండా ఊ కొడితే మహిళలు మనసువిప్పి మాట్లాడితే, చెవులు మూసుకొన్నందుకు, మగవాడి మాడు పగలకొడతారు కదా! అందువలన వారు చెప్పిందే ఇక్కడ రాశాను.వాళ్లు చేప్పినదాని ప్రకారం నేటి యువతులు,కన్యలు, హీరోయిన్ లను అనుకరిస్తూ ఈ క్రింది పోటొ లో తమ్మన్నా తో పోటిపడుతూ వీపు ప్రదర్శన చేస్తున్నారని తెలిసింది. అటువంటి దుస్తులు ధరించే యువతులకి వారి అమ్మల ప్రోత్సాహం కూడా ఉన్నట్లు చెప్పారు.
http://idlebrain.com/movie/photogallery/tamanna82/pages/image093.html
ఇక మా ఆఫీసులో అమ్మాయిలు, పై పోటొలో తమ్మన్నా కన్నా అడ్వాన్సేడ్ వర్షన్ లో దుస్తులు వేసుకొని, రోజు ఆఫీసుకి వస్తారు. వాళ్లేమైనా 100కోట్ల వారసులా అంటె, మధ్యతరగతి వాళ్లు. బయటికి వేళితే చాలు ముందర ఓడ్కా బోటిల్ ఎత్తుతారు. ఇది చెల్లెమ్మా నేను చూస్తున్న ప్రస్తుత సమాజం. అందువలన అలా రాశాను. శెలవు.
చివరిగా ఒకమాట నా అక్కచెళ్లెళకు ఎప్పుడో పెళ్ళిళైనాయి.
ఇట్లు
మీ అన్నయ్య
నిన్నమొన్నటివరకూ మనం స్త్రీలలో కోరుకున్నది అణకువను, అందాన్నేగానీ దక్షతనో, ధైర్యాన్నో కాదు. అణకువతోకూడిన అందాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళు అలాగే మసలుకున్నారు నిన్నమొన్నటివరకూ.
Deleteఇప్పుడు జరుగుతున్న cultural changesలో కొందరు అదే పాతకాలపు భావాన్ని (అణకువను వర్జించి) మరింత ఎక్కువగా కొనసాగిస్తున్నారు. కొందరు దక్షత వైపు మళ్ళుతున్నారు. బహుశా ఇప్పుడు మనం చూస్తున్న వికృత పరిణామాలు స్త్రీసమాజంలో అందరూ ఒకేలా ఆలోచించలేకపోవడం, పురుషులు దీన్ని ఎలా స్వీకరించాలో తెలియకపోవడంవల్లననుకుంటాను. ఒక వందేళ్ళతరువాత సమాజం ఇప్పుడున్నదానికంటే మెరుగ్గా ఉండగలదని నా అభిప్రాయం.
http://www.facebook.com/raju.vizag.3/posts/128504017312114?comment_id=168183¬if_t=like
ReplyDeleteసమస్త ప్రాణ కోటిలో కేవలం మనుష్యులలో మాత్రమే "స్త్రీ" పురుషులకన్నా అందంగా ఉంటుంది అనే అపోహ బలంగా, అనాదిగా నాటుకుపోయింది...
ReplyDeleteనిజానికి అందం అనేది పశు పక్షాదుల వైపు నుంచి చేస్తే (బాహ్యం) కానీ ఆలోచన, విచక్షణ ఉన్న మనుషుల పరంగా చూస్తే సౌందర్యం అనేది (అంతర్లీనం)...
నెమలి (మగ) పురివిప్పి నర్తిస్తే చూడముచ్చటగా ఉంటుంది, అదే ఆడ నెమలి కనిపిస్తే కళ్ళకు పెద్ద ఆనందం ఏమి అనిపించదు. ఇక్కడ మగ నెమలి తాను అందంగా కనిపించాలని ఏమైనా అలంకరణలు చేసుకుంటుందా...?
సింహం (మగ) - మృగరాజు, అలా నడిచి వస్తుంటే - ఆ నడకలో గాంభీర్యం, ముఖంలో వచ్చస్సు - రోషం, పౌరుషం.. అవసరానికి మించని క్రోదం, ఆకలికి తప్ప ఆటవిడుపుగా వేటాడని స్వియ నియంత్రణ...
చూడచక్కని రూపం, అందాన్ని పెంచే గుబురు గెడ్డం, ఇవన్నీ కేవలం మగ సింహం సొంతం కాని ఆడ సింహం చాలా సాదా సీదాగా ఉంటుంది. అందుకే మగ సింహానికే అందంలో ప్రధమ స్థానం... :)
ఇలా చెప్పుకుంటూ పోతే, పశు పక్షాదుల్లో మగ పుట్టుకలే అందానికి ప్రతీకలు.. కాని మన కర్మ, మనుషులమైనా పశువుల్లానే ప్రవర్తిస్తున్న మన ప్రవర్తన పరివర్తన చెందక ఇలా సిగ్గులేని జీవితాన్ని గడిపెస్తున్నాం...
పశువులు, పక్షులు.. తమ, తమ సహజ సిద్దమైన అందానికి మాత్రమే కట్టుబడి జీవిస్తున్నాయి. మరి మనిషి మాత్రం ఎందుకు అందాలను "కొని" తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నాడు...?
దీనికి మీ సమాధానం ఏమిటి ? సాంకేతిక పరిజ్ఞానమా ? పారిశ్రామికాభివృద్ధా ? లేక మరేదైనానా...?
మన మనుషుల్లో బాహ్య సౌందర్యానికి విలువ ఇవ్వరు, మనో సౌందర్యానికే పెద్ద పీట వేస్తారు - ఎందుకంటే మనం పశువులం కాదు కనుక మనుషుల్లా ఆలోచిస్తాం కనుక కాని ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి...
పూర్వం "స్త్రీ" అంటే ఒక పవిత్ర మూర్తిగానే కనిపించేది, "మనో"రమా.. "మనో"హరి.. "మనో"రంజిని.. అని పలు రకాలుగా కవులు కీర్తించిన స్త్రీ అందం బాహ్యం కాదు మనస్సుది... :)
స్త్రీ అంటే అమ్మతనం, సహనం, శాంతం, పవిత్రం, దైవత్వం.. ఇవన్నీ తనలో నిలుపుకున్న దేవత, మరి ఇప్పుడో ? స్త్రీ అంటే పంచదార బొమ్మ - ముద్దు గుమ్మ, అందచందాలను అంగాంగ ప్రదర్శన చేసి చూపి అంగడి సరుకు, డబ్బు పారేస్తే చాలు సుఖం - సౌక్యం లభిస్తాయి...
ఇవన్నీ నేననేవి కావు, ప్రస్తుత సమాజంలో స్త్రీకి, స్త్రీతత్వానికి మగాడు మనసులో ఉన్న విలువ - ఆ విలువ దిగజారిపోవడానికి కారణం స్త్రీ (పరోక్షంగా అయినా, ప్రత్యక్షంగా అయినా)...
ఇంకా ఉంది............
ఒకప్పుడు స్త్రీ బయటకు రావాలంటే భయపడేది, అంత పద్ధతి - కాని మనం పశువులం కాదుగా, అందుకే స్త్రీకి కుడా స్వేచ్చ కల్పించాలని బయట ప్రపంచానికి మెల్లగా పరిచయం చేసాం...
Delete(పశువుల్లో - వన్య ప్రాణుల్లో, ఆడ జంతువులు కాని పక్షులు కాని చాల అరుదుగా మాత్రమే మనకు కనిపిస్తాయి కావాలంటే పరీక్షించి చూసుకోండి. ఎందుకంటే వాటి దృష్టిలో మగవి బయట కష్టపడాలి, ఆడవి ఇంట కష్టపడాలి - సమపాళ్ళలో సంసారాన్ని నేట్టుకురావాలి. ఒకప్పుడు మనిషి సైతం ఇలానే ఆలోచించే వాడు, కాని ఆడదాన్ని వంటింటి కుందేలుగా చేయడం సమజసం కాదనే మానవతా దృక్పదం స్త్రీ స్వేచ్చకు బీజం వేసింది - ఫలితం ఈ రోజు మనం చూస్తున్నాం)
ఒకప్పుడు స్త్రీకి అలంకరణ అంటే - చిటికెడు పసుపు, నుదుట తిలకం(కుంకం), కంటికి కాటుక, కాళ్ళకు పారాణి. ఆభరణాలంటే - చేతికి గాజులు, కాళ్ళకు పట్టీలు, చెవులకు కమ్మలు అంతే.. పెళ్లి అయ్యాక మేడలో మంగళ సూత్రం, కాలి వేళ్ళకు మట్టెలు అంతే...
మరి ఇప్పుడో..! ముఖానికి "ఫేషియల్స్", బ్యూటీ పార్లర్లు, ఐబ్రో షేపింగ్, హెయిర్ రిమూవల్స్, టాటూస్, కర్లీ హెయిర్ స్ట్రిప్నింగ్, ఒకటా రెండా.. :) అసలు పసుపు, కుంకుమ అంటే ఏంటి అనే స్థితికి పడిపోయింది మన స్త్రీ...
బొట్టు పెట్టుకొనే అమ్మాయిని బూతద్దంలో వెతకాల్సిందే ఎందుకంటే వాళ్ళు బొట్టు పెట్టుకున్నా పెట్టుకునట్టు కనిపించరు అంట చిన్నగా ఉంటుంది మరి ఆ బొట్టు బిల్ల...
చేతికి కంకణాలు తొడిగెస్తున్నారు, వాచీలు పెట్టేస్తున్నారు.. గాజులు గాలికొదిలేసి చాలాకాలం అయిపోయింది, సంస్కృతి సాంప్రదాయం అంటే గాడిద గుడ్డు అంటున్నారు.. బుజాలు కనిపించేలా స్లీవ్ లెస్ వేసి ఆ బుజాల మీద టాటూలు పోడిపించుకొని "ఫ్యాషన్" అంటున్నారు...
ఇలాంటి తింగరి పనులు మగవాళ్ళు కొందరు చేసినా వాళ్ళను వేళ్ళ మీద లేక్కపెట్టేయచ్చు మరి అమ్మాయలలోనో..! పద్దతిగా ఉన్న వాళ్ళను వేళ్ళ మీద లెక్కించవచ్చును...
కాళ్ళకు పట్టీలు మర్చిపోయారు, హై హీల్స్ సోయగం కావాల్సి వచ్చింది - అది చాలా ప్రమాదకరం అని వైద్యులు సూచిస్తున్నా ఎవ్వరూ వినే స్థితిలో లేరు, మగారితో పోటీ పడిపోవాలి.. వాళ్ళేనా ఎత్తుగా ఉండేది. మేము ఉండాలి అదే ఇక్కడ హై హీల్స్ పంతం... ;)
ప్రతీ దానిలో మగాడికి పోటీ ఇవ్వాలి, చదువులో పోటీ (తప్పులేదు), ఉద్యోగాల్లో పోటీ (కాస్త ప్రమాదమే), వ్యసనాలలో పోటీ (ఇది చాలా ప్రమాదం), చివరికి నువ్వెంత అంటే నువ్వెంత అనేంత పోటీ వచ్చేసింది...
నేను నీలాగే చదువుకున్నాను, నీలానే ఉద్యోగం చేస్తున్నాను, నీలానే తాగుతాను - తిరుగుతాను, ఏంటి నీ గొప్ప అని ప్రశ్నించడం గొప్ప అనుకుంటున్నారు నేటి మహిళలు, తాగుబోతు - తిరుగుబోతు భర్తను మంచి మనిషిగా మార్చిన భార్యలను ఒకప్పుడు చుసిన ఈ సమాజం ఇప్పుడు...
ఆ తాగోబోతు భర్తకు కంపెనీ ఇస్తున్న ఆభునిక భార్యను చూడాల్సి వచ్చింది.. :) ఇదే ఆడనానికి కావాల్సిన అభివృద్ధి అయితే..! స్వాతంత్రం అయితే, ఆమెకు అవి ఎప్పుడో లభించేసాయి...
కాకపోతే అత్యాచారాల విషయంలో కాస్త భయపడుతున్నారు, వెనకపడుతున్నారు మన మహిళలు - మగాడిలో మాత్రమె మృగం అనేది సరి కాదు, మనిషిలో మృగం అంటే బాగుంటుంది...
స్త్రీలలో కూడా కామం ఉంటుంది, వాళ్ళలో కూడా కొందరు బరి తెగించిన వాళ్ళు ఉంటారు, కాని మన సమాజంలో సిగ్గుపడే విషయం ఏమిటంటే - ఒక ఆడది నాకు అన్యాయం జరిగింది అని అంటే కొన్ని వందల నోళ్ళు లేస్తాయి, అదే మాట ఒక మగాడు అంటే ? సిగ్గులేదు ఇలా పది మందిలో చెప్తున్నావు అంటారు... :(
ఈ రోజుల్లో స్త్రీల మీద (పసి పిల్లల మీద కూడా) జరుగుతున్న అత్యాచారాలను విని తట్టుకోలేకున్నాను, మానవత్వం మరణించిందా అనేలా ప్రవర్తిస్తున్నారు జనం...
దీనికి మనిషి ఆలోచనా విధానం ఒక కారణం అయితే, ఆ ఆలోచనలకు ఆద్యం పోసే మాధ్యాలు కూడా అనేకం ఉన్నాయి వాటిలో "స్త్రీ వస్త్ర ధారణ" ఒకటి...
పూర్వం స్త్రీ పవిత్రతకు, పద్ధతికి మారుపేరు.. కాని ఇప్పుడు స్త్రీ అందానికి, ఆధునికతకు మరో పేరు.. :) అమ్మతత్వం నుంచి బొమ్మతత్వానికి మారిపోయింది స్త్రీ...
Deleteఅమాయకత్వం నుంచి అమ్మో అనేలా పరిణితి చెందింది మన స్త్రీ, బయటకు వెళ్ళాలంటే తనకు ఏది సౌకర్యంగా ఉందొ అది ధరించాడు, తాను ఎందులో అందంగా కనిపిస్తుందో అది కూడా ధరించదు.. ప్రస్తుతం నడుస్తున్న "ట్రెండ్" ఏంటి ? మనల్ని చూసే కళ్ళకు ఎందులో అందంగా కనిపిస్తాం, ఏది ప్రస్తుతం నడుస్తున్న "ఫ్యాషన్" ఇదే ముఖ్యం...
టైట్ ఫిట్స్ వేస్తున్నారు - అది వాళ్లకు సౌకర్యంగా ఉంటుంది అని వాళ్ళు అంటే మీరు నమ్ముతారా ? ఎవరికైనా వదులుగా ఉన్న దుస్తులైతే సౌకర్యంగా ఉంటాయి కాని బిగుసు దుస్తులు ఎలా అలా...! కాని వారు అవే వేయడానికి ఇష్టపడుతునారు కారణం మనం మనకు నచ్చేలా ఉంటె సరిపోదు అందరికీ నచ్చేలా ఉండాలి...
ఇది వాళ్ళ ఆలోచనా విధానం, అందుకే ముఖానికి మందంగా "మెక్ అప్" వేస్కొని అందాన్ని బ్యూటీ పార్లల్ నుంచి కొని తెచ్చుకోవడం.. రోడ్ల మీద "హై హీల్స్" వేస్కొని పిల్లి నడక నడుస్తూ హెచ్చుపోవడం...
బిగుసు దుస్తుల్లో, కురస దుస్తులతో కుస్తీలు పడుతూ ఆరు బయట తిరగటం, ఇవన్నీ అవసరమా..! అదే అడిగారు కొందరు పెద్దలు, దానికి వాళ్ళ ప్రతిస్పందన ఏమిట్రా అంటే...
"మేమెలా బట్టలు ఎలా వేస్కోవాలో చెప్పకండి, అమ్మాయలను అత్యాచారం చేయడం తప్పని మీ కొడుకులకు చెప్పండి" అని పొగరు సమాధానం ఇస్తున్నది నేటి యువ యువతీమణి...
మనో నిబ్బారం ఉన్న మగాడు, స్త్రీ నగ్నంగా తన ముందు నిలబడినా తప్పు చేయకుండా తనను తానూ నియంత్రిచుకోగలదు - అదే స్త్రీని ఒక "సెక్స్ బొమ్మ"లా చూసే మగాడికి మనో నిబ్బరం అంటే ఏంటో కూడా తెలీదు...
వాడికి అర్ధ నగ్నంగా కనిపించినా చాలు, నియంత్రణ కోల్పోయి పశువులా మీదపడి అత్యాచారానికి పాల్పడే అవకాసం ఉంది.. అలాగని అలా కురస, బిగుసు, ఆధునిక దుస్తులు వేస్కున్నవారికే ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం లేదు. వారికి ప్రత్యెక సూచనలు మాత్రమే చేస్తున్నారు నిపుణులు...
మీరు స్వేచ్చగా, స్వాతంత్రంగా, నిర్భయంగా తిరగాలంటే కాస్త మీ పద్దతులు, దుస్తులను మార్చుకోండమ్మా అన్నారు అంతేగా ? దానికే రాద్దాంతమా...! మీ మంచి కోరి చెప్పారే కాని మిమ్మల్ని అనిచేయాలనే ఉద్దేశంతో కాదని గుర్తించండి...
నియంత్రణ కోల్పోయిన మగాడు, మనిషి కాదు పశువుతో సమానం - ఒక పశువు నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి తెలుసుకొని దానికి తగట్టు నడుచుకుంటే మంచిది. అత్యాచారాలు చేసే వాడి దగ్గరకు వెళ్ళి ఇది తప్పు అలా చేయద్దు అంటే వాడికి అర్ధం కాదు...
ఎందుకంటే ఒక దున్నపోతు దగ్గరకు వెళ్ళి, నువ్వు అలా కొమ్ములతో పోడవ కూడదు తప్పు అంటే దానికి అర్ధం అవుతుందా ? ఆ మనిషి కుడా ఈ దున్నపోతుతో సమానం...
కనుక వాళ్ళను మార్చలేం కనుక మిమ్మల్ని మీరు మార్చుకోండి, మీ శ్రేయస్సే మేము కోరుకొనేది.. మీరు బాగుంటేనే మేము బాగుంటాం.. చెప్పేది బుర్రకేక్కించుకొండి, పెడచెవిన పెట్టకండి.. ఆవేశాన్ని కాస్త అదిమి ఆలోచనకు పదును పెట్టి చూడండి మీకే తెలుసుతుంది... :)
"స్త్రీ" పురుషులకన్నా అందంగా ఉంటుంది."
Deleteఎవరన్నారు వాళ్లు అందంగా ఉంటారని? వాళ్లది సహజమైన అందం కాదు. చాలా మంది ఆధునిక మహిళలు నెత్తిన జుట్టు, కనుబొమ్మలు మొదలు కొని కాలి గోరు వరకు బ్యుటి పార్లర్లకు వేళ్లి నగిషీలు చెక్కించుకొంటారు. కేర్ తీసుకొంటే ఇంట్లో ఉండే పెంపుడు కుక్క పిల్ల కూడా ఎంతో ముద్దుగా కనిపిస్తుంది. ప్రకృతి లో అందం ఉండేవి ఒక్క మగ జాతి జంతువులే. ఇది అందరికి తెలిసిన విషయమే. స్రీలు అందంగా ఉంటారనేది పచ్చి అబదం. ప్రకృతి లోని జంతువులలో మనుషులు మాత్రమే చేసిన ఒక ప్రాపగండ. సర్ఫ్ వాడితే గుడ్డలు మిల మిల లాడే తెలుపు తో మెరుస్తాయని యాడ్ లో ప్రచారం చేసినట్లు, పాత రోజుల్లో మగవారు ఇలా పచ్చి అబద్దాలను సాహిత్యంలో ప్రచారం చేశారు. చాలా మంది స్రీలు ఆ ప్రచారాన్ని గుడ్డిగా నమ్మేసారు. అందరికి పొగిడించుకోవాలనే ఆశ ఉంట్టుంది కదా! వాళ్ళ నెందుకు అనుకొనేది, మన మగవాళ్లకి బుద్ది ఉంటే ఇలాంటి అబద్దాలను ప్రచారం చేసి ఉండేవారా?
@ Anonymous sir/madam :
ReplyDeleteపల్లెటూర్లలో, గిరిజన ప్రాంతాలలో, కూలి - నాలి చేస్కొని పొట్టపోస్కోనే పేద కుటుంబాల స్త్రీలతో పోలిస్తే పట్టణాలలో, నాగరీక ప్రపంచంలో, చదువుకున్న - ఉన్నత స్థానానలో ఉన్న ధనిక - మధ్యతరగతి స్త్రీల మీదనే అత్యాచారాలు సింహభాగాలలో ఉన్నాయనేది నిజం...
మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలి, చదువులేని అమాయకపు అమ్మాయలను.. నిస్సహాయ స్త్రీలను మాత్రమే మదోన్మాద మృగం ఎంచుకొని తన కోరికలను తీర్చుకుంటుంది అనుకుంటే పొరపాటే...
ఈ మృగాలకు, విలువలు లేవు.. వావి వరసలతో పనిలేదు.. గట్టిగా మాట్లాడితే ఆడ మగా అనే తేడా కూడా లేదు, శారీరక వాంఛ తీర్చుకోడానికి వాడికో శరీరం కావాలి అంతే...
అందుకే "పసి పిల్లలు" మీద సైతం అత్యాచారాలు జరుగుతున్నాయి, వీరిలో కేవలం అమ్మాయలె ఉన్నారు అనుకోవడం మీ బ్రమ మగపిల్లల్లో కూడా ఈ మృగం బాధితులు ఉన్నారు...
ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏమిటంటే, "వస్త్ర ధారణ" అనేది కేవలం వందలో ఒక కారణం మాత్రమే - కాకపోతే ముఖ్య భూమిక పోషిస్తున్న కారణం కనుక దాన్ని మార్చుకోమనే సూచన చేస్తున్నారు పెద్దలు...
ఇక్కడ స్త్రీ స్వేచ్చాస్వాతంత్రానికి వచ్చిన నష్టం ఏమి లేదు, వాళ్ళ బద్రతను దృష్టిలో ఉంచుకొని చేసిన సూచనే కాని వాళ్ళను అనిచివేయాలనే అనుచిత ఉద్దేశంతో చేసిన వ్యాక్యాలు కావవి...
స్త్రీలలో అభ్యుదయ భావాలు ఉండటంలో తప్పు లేదు కాని, దానికి తోడు సంస్కృతీ సాంప్రదాయాల మీద అవగాహన, మర్యాదా కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఉంది...
దీనికి పురుషులు సైతం మినహాయింపు ఏమి కాదు, కాని మన సమాజంలో పురుషులకన్నా స్త్రీలకు ఎక్కువ విలువ, స్త్రీల మీద ఎక్కువ నమ్మకం ఉన్నాయి...
వాటిని కాపాడుకోవలసిన బాధ్యత స్త్రీలమీదనే ఉంది, పద్దతిగా.. హుందాగా నడుచుకుంటే మీ పూర్వ వైభవం మీకు తిరిగి రావడానికి మరో వంద సంవత్సరాలు (శతాబ్ధి) అక్కర్లేదు ఒక దశాబ్ధి చాలు... :)
ఓరి నాయనో ఏమి చర్చ సాగింది. ఇంతకీ అసలైన కర్తలెవ్వరు ఈ చర్చలో పాల్గొనలేదు. విపరీత దుస్తుల మిద చర్చ సాగింది బాగానే ఉన్నది. కానీ, మన దేశంలోని ఆడవారిలో ఎంత శాతం మంది ఈ విపరీత దుస్తుల్ని వేసుకుని తిరుగుతున్నారు? ఈ లెక్కలు లేవు. ఈ విపరీత దుస్తుల్ని ఎంతమంది ఆడవారు సపోర్టు చేస్తున్నారో తెలియదు, కానీ అలా వారు విపరీత దుస్తులతో వెళుతుంటే చూడాలనే కోరికగలవారు స్వాతంత్రం పేరుతొ సపోర్టు చేస్తున్నారా??? పైన చర్చలో ఆడవారేవ్వరు పాల్గొనక పోవటం వలన ఈ అనుమానం వస్తోంది.
ReplyDelete